🏠 janampowerjournalist.online
Watermark
Newspaper Logo
janampowerjournalist.online | Date: 27 Jun, 2026 | Page: 1

ఆపరేషన్ జన్నారం: 'జనం పవర్ జర్నలిస్ట్ ' దెబ్బకు కూలిన కబ్జా సామ్రాజ్యం.. తహసీల్దార్ ఆఫీస్ వెనుకే జేసీబీల గర్జన!

సర్వే నంబర్ 374లో అక్రమ కట్టడాలు ధ్వంసం!
​జర్నలిస్ట్ తుడుం జితేందర్ కలం పోటుకు కదిలిన ఖాకీ, రెవెన్యూ యంత్రాంగం.
​కలెక్టర్ కుమార్ దీపక్ 'యాక్షన్' ఆర్డర్.. క్షేత్రస్థాయిలో ఎమ్మార్వో బక్కయ్య, ఎస్ఐ ఉదయ్ కిరణ్, ఈవో రాహుల్ అటాక్!

ఆక్రమణదారుల గుండెల్లో 'జనం పవర్ జర్నలిస్ట్' వణుకు!
​అధికార గణం కూర్చునే మండల పరిపాలనా కేంద్రం ముక్కు ముందరే కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిపై కబ్జాకోరులు కన్నేశారు. జన్నారం తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న సర్వే నంబర్ 374 నిశబ్దంగా ఆక్రమణల చెరలోకి వెళ్తోంది. రాత్రికి రాత్రే పునాదులు లేచాయి, గోడలు వెలిశాయి. అంతా సజావుగానే సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో.. 'జనం పవర్' దినపత్రిక ప్రతినిధి తుడుం జితేందర్ రాసిన ఇన్వెస్టిగేటివ్ కథనాలు కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. వరుస కథనాలతో నిద్రలేచిన జిల్లా యంత్రాంగం శనివారం ఉదయం ఒక్కసారిగా జేసీబీలతో దాడి చేసింది.
​కలెక్టర్ క్విక్ డెసిషన్.. గ్రౌండ్‌లోకి త్రిమూర్తులు!
​పత్రికా కథనాల తీవ్రతను గమనించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా 'క్లీన్ అప్' ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో జన్నారం మండల అధికారులు ముగ్గురు ఏకమై కబ్జా స్థలాన్ని చుట్టుముట్టారు:
​ఎమ్మార్వో బక్కయ్య (రెవెన్యూ పవర్): సర్వే రికార్డులు పట్టుకుని స్పాట్‌కు చేరిన తహసీల్దార్ బక్కయ్య, అక్రమ నిర్మాణాల సరిహద్దులను లెక్కగట్టి.. క్షణాల్లో జేసీబీలకు పని చెప్పారు.
​ఎస్ఐ ఉదయ్ కిరణ్ (పోలీస్ ప్రొటెక్షన్): కూల్చివేతలను అడ్డుకోవాలని చూసిన కబ్జాదారుల ముఠాకు ఎస్ఐ ఉదయ్ కిరణ్ తన 'ఖాకీ' స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. భారీ బందోబస్తుతో ఎలాంటి గొడవలు జరగకుండా ఏరియాను తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు.
​ఈవో రాహుల్ (పంచాయతీ యాక్షన్): నిబంధనలకు విరుద్ధంగా, కనీస అనుమతులు లేకుండా సాగిన నిర్మాణాల అక్రమాలను ఈవో రాహుల్ లీగల్‌గా క్లోజ్ చేసి అధికారుల చర్యకు బలాన్నిచ్చారు.
​"ఇది ట్రైలర్ మాత్రమే..!" – అధికారుల గట్టి హెచ్చరిక
​కూల్చివేతల అనంతరం అధికారులు కబ్జాదారులకు గట్టి సందేశాన్ని పంపారు. సర్వే నంబర్ 374 భూమి పూర్తిగా ప్రభుత్వ ఆస్తి అని, ఇక్కడ గజం స్థలాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇకపై జన్నారం మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామని ఎమ్మార్వో బక్కయ్య, ఎస్ఐ ఉదయ్ కిరణ్ హెచ్చరించారు.
​సంచలనంగా మారిన 'జనం పవర్ జర్నలిస్ట్' ఇంపాక్ట్
​కళ్లముందే ప్రభుత్వ భూమి కరిగిపోతుంటే కాపాడిన 'జనం పవర్' విలేకరి తుడుం జితేందర్‌పై జన్నారం ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ నేతృత్వంలో ఎమ్మార్వో, ఎస్ఐ, ఈవో చూపించిన 'సింగం' లాంటి స్పీడ్‌కు స్థానికులు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.
🏠 Home