🏠 janampowerjournalist.online
Watermark
Newspaper Logo
janampowerjournalist.online | Date: 29 Jun, 2026 | Page: 1

నార్నూర్ లో సహకార వారోత్సవ వేడుకలు

నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవారం సహకార వారోత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్బంగా పీఏసీఎస్ చైర్మన్ సురేష్ ఆడే సహకార పథకాన్ని ఆవిష్కరించారు. సహకార సంఘాలు రైతుల ఆర్థికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధికి వెన్నుముకలా నిలుస్తున్నాయన్నారు. రైతులు సహకార సంఘాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గణేష్, యశ్వంతరావు, కాసిం తదితరులున్నారు.
🏠 Home