తిమ్మాపూర్ పాఠశాలలో కలకలం.. ఉపాధ్యాయుడిపై ఆరోపణలు, ఇద్దరికి డిప్యూటేషన్
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ ఎం.పీ.యూ.పీ.ఎస్ పాఠశాలలో ఎస్ జి టి గా ఉపాధ్యాయుడు ఏ. సురేందర్‌పై విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై పాఠశాల హెడ్ మాస్టర్ రాథోడ్ రాజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, కొంతమంది విద్యార్థినులు ఆ ఉపాధ్యాయుడు తమకు వద్దంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఏబీవీపీ నాయకులు, స్థానిక యువతతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పందించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ రాజేందర్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తిరుపతి పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించినట్లు తెలిసింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి అంతరాయం కలగకుండా ఉండేందుకు, అలాగే పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఇద్దరు ఉపాధ్యాయులను తాత్కాలికంగా వేరే వేరే ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపినట్లు ఎంఈఓ వెల్లడించారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నామని, మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది.