🏠 janampowerjournalist.online
Watermark
Newspaper Logo
janampowerjournalist.online | Date: 16 Jul, 2026 | Page: 1

ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా ఆకాడి పండుగ వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఎంపల్లి, మాన్కపూర్, మల్కుగూడ, అదేవిదంగా గాదిగూడ మండలం ఆదివాసీ గ్రామ శివారులో గురువారం ఆకాడి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అడవితల్లి, దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడే వండిన అన్నంతో లడ్డూ గోలాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పశువులను ప్రత్యేకంగా అలంకరించి దేవతల చుట్టూ ఊరేగించారు. పశువుల కాపరులకు ప్రసాదాన్ని అందించి వాటి ఆరోగ్యం, గ్రామంలో సుఖశాంతులు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు టేకు ఆకుల్లో సామూహిక భోజనాలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వానదేవుని ఆశీర్వాదాలు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ వేడుకల్లో మెస్రం రూపుదేవ్ పటేల్, మెస్రం మోతిరామ్, మెస్రం బాద్దిరావు, తొడసం భీంరావ్, మోకాసి నాన్నాజీ, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు, పెందోర్ ప్రభు పటేల్, పెందోర్ మాణిక్ రావు, కుంరం కొద్దు, పెందోర్ రాంసావ్, పూసం ప్రారశురామ్, ఆత్రం సుంగు, కొట్నాక్ పవన్, మెస్రం సీతారామ్, ఆత్రం నాగోరావు, తొడసం నాగోరావు, మాజీ సర్పంచ్ రాథోడ్ సావిందర్, రాథోడ్ గణేష్, సెడ్మకి ఆనంద్‌రావు, పటేల్ కనక గోపాల్‌రావు, మెస్రం హన్మంత్‌రావు, మాడవి చిత్రు, మరప కేసోరావు, ఆత్రం తుకారాం, కొడప సాంబాజీ, సెడ్మకి తుకారాం, కనక జుగాదిరావు, కనక గోవింద్‌రావు, కడం తెలంగారావు, అర్కా తిరుపతి, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home