విద్యాసంస్థల్లో డ్రగ్స్‌కు చెక్.. జీరో టాలరెన్స్ అమలుకు డీజీపీ సి.వి. ఆనంద్ ఆదేశాలు
రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలను పూర్తిగా డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పోలీసు శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగం, సరఫరాపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఈగల్ (EAGLE) విభాగం అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణపై హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో తప్పనిసరిగా "యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలు" ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యాసంస్థలో ఒక క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ నియమించి, విద్యార్థుల భద్రతతో పాటు డ్రగ్స్ నిరోధక చర్యలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ బాధ్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు.
డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసు శాఖ ఒక్కటే కాకుండా విద్యాశాఖ, ఆరోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైన చోట సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల్లో ప్రవర్తనా మార్పులను ముందుగానే గుర్తించి వారికి సరైన మార్గదర్శనం అందించడం ద్వారా డ్రగ్స్ బారిన పడకుండా కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రుల పాత్ర కూడా అత్యంత కీలకమని పేర్కొన్న డీజీపీ, పాఠశాలలు, కళాశాలల్లో పేరెంట్ అవగాహన సమావేశాలు నిర్వహించి డ్రగ్స్ ప్రమాదాలపై చైతన్యం కల్పించాలని సూచించారు. విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ, అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.
డ్రగ్స్ నియంత్రణ నిబంధనలను పాటించని లేదా నిర్లక్ష్యం వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే ఆయా విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే స్థాయిలో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ సరఫరా, వినియోగానికి అవకాశం కల్పించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డ్రగ్స్ రహిత విద్యాసంస్థల లక్ష్యంతో త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) విడుదల చేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించే ముందు మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహించి అమలు విధానాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఐజీ పద్మజా రెడ్డి, ఎస్పీ గిరిధర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి "డ్రగ్స్ రహిత తెలంగాణ" లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నామని డీజీపీ సి.వి. ఆనంద్ పునరుద్ఘాటించారు.