🏠 janampowerjournalist.online
Watermark
Newspaper Logo
janampowerjournalist.online | Date: 23 Aug, 2026 | Page: 1

*శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన*

*హంగిర్గకు రూ.కోటిన్నర అభివృద్ధి నిధులు*


ఎమ్మెల్యే రామారావు పటేల్

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని హంగిర్గ గ్రామ అభివృద్ధికి సుమారు రూ.కోటిన్నర నిధులు మంజూరైనట్లు *ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.* దేవాదాయ, ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధుల నుంచి రూ.50 లక్షలతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కళ్యాణ మండపం, రోడ్లు, డ్రైనేజీతో పాటు హిప్నెల్లి నుంచి సరస్వతి నగర్ వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అంగన్‌వాడీ, వివో భవనాలు, గ్రామపంచాయతీ భవనం తదితర అభివృద్ధి పనులకు సుమారు రూ.కోటిన్నర వరకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. తానూర్ మండలానికి సంబంధించిన 27 ప్యాకేజీ అంశాన్ని పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ పూర్తి చేయడానికి రూ.700 కోట్లకు పైగా బడ్జెట్ అవసరమవుతుందని తెలిపారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 27 ప్యాకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 27 ప్యాకేజీ పూర్తయితే తానూర్ మండలం మొత్తం వ్యవసాయ రంగంలో సస్యశ్యామలంగా మారుతుందని పేర్కొన్నారు.గ్రామంలో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు,గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home