బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు
జనం పవర్ జర్నలిస్ట్ వేల్పుల నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఆగస్టు 25,
గోదావరిఖని: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి 11వ ఇంక్లైన్ మైన్‌లో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు, సిబ్బందికి సంప్రదాయబద్ధంగా రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సోమారపు లావణ్య అరుణ్ మాట్లాడుతూ.. రక్షాబంధన్ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సింగరేణి కార్మికులు సంస్థ అభివృద్ధికి అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు.
కార్మికులు, అధికారులు, సిబ్బందితో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం ద్వారా సోదరభావం, ఆత్మీయత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కార్మికులు, బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు, పిట్ సెక్రటరీ వేల్పుల లక్ష్మణ్, ముల్గురి వీరయ్య, పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భారతి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, 60వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ అరిగేల శ్రవణ్, 54వ డివిజన్ నాయకుడు రాజు, బీజేపీ నాయకులు సురేష్, శంకర్, కుమారస్వామి, హనుమంత్, మంజుల, రజిత, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.