🏠 janampowerjournalist.online
Watermark
Newspaper Logo
janampowerjournalist.online | Date: 31 Aug, 2026 | Page: 1

ఏకశిలా ధ్వజ స్తంభం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా..

జనం పవర్ జర్నలిస్టు వేల్పూర్ నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఆగస్టు 31,
భక్తుల సౌకర్యార్థం ఆలయాల ముందు నూతన షెడ్ల ప్రారంభం
రామకృష్ణాపూర్: పట్టణంలోని శ్రీశ్రీశ్రీ విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో ఏకశిలా ధ్వజ స్తంభం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు బూరుగుపల్లి రామకృష్ణ శర్మ, రాజేందర్ శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛారణలతో ధ్వజ స్తంభానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు, కృష్ణమూర్తి అయ్యప్ప గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి, సంతోషిమాత, అయ్యప్ప స్వామి ఆలయాల ముందు భక్తుల సౌకర్యార్థం ఇటీవల నిర్మించిన నూతన షెడ్లను అర్చకులు రాజేందర్ శర్మ, సతీష్ శర్మ వేదమంత్రాల నడుమ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దేవాలయాలకు వచ్చే భక్తులు ఎండ, వానల నుంచి ఇబ్బందులు పడకుండా ఉండటంతో పాటు, పూజా కార్యక్రమాల సమయంలో మరింత సౌకర్యంగా ఉండేందుకు నూతన షెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో దాతల సహకారంతో షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి సహకరించిన దాతలు, హనుమాన్ భక్త బృందం సభ్యులకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ధ్వజ స్తంభం వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛారణలతో కార్యక్రమం భక్తిమయంగా సాగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
కార్యక్రమంలో విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులు పెద్దపల్లి ఉప్పలయ్య, సీతారాం రెడ్డి, హనుమాన్ భక్త బృందం అధ్యక్షుడు దురిశెట్టి రవి, ప్రధాన కార్యదర్శి గంగులు యాదవ్, ట్రెజరర్ బద్రి సతీష్, ప్రచార కార్యదర్శి గోనె రాజేందర్, ఉపాధ్యక్షులు అప్పాల రవి, ముద్దసాని శ్రీనివాస్, కమిటీ సభ్యులు జంగంపల్లి లింగయ్య, శ్రావణ్, శ్రీనాథ్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
🏠 Home