🏠 janampowerjournalist.online
Watermark
Newspaper Logo
janampowerjournalist.online | Date: 14 Sep, 2026 | Page: 1

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

జన్నారం: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. మండలంలోని పీస్ కమిటీ సభ్యులతో జరిగిన ఈ సమావేశంలో ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై చర్చించారు. మండపాల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల్లో ప్రభుత్వ నిబంధనలు, పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

మత సామరస్యాన్ని కాపాడుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా, ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతో ఉత్సవాలను సోదరభావంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించాలని పీస్ కమిటీ సభ్యులను కోరారు.
🏠 Home