ఆపరేషన్ జన్నారం: 'జనం పవర్ జర్నలిస్ట్ ' దెబ్బకు కూలిన కబ్జా సామ్రాజ్యం.. తహసీల్దార్ ఆఫీస్ వెనుకే జేసీబీల గర్జన!
సర్వే నంబర్ 374లో అక్రమ కట్టడాలు ధ్వంసం! జర్నలిస్ట్ తుడుం జితేందర్ కలం పోటుకు కదిలిన ఖాకీ, రెవెన్యూ యంత్రాంగం. కలెక్టర్ కుమార్ దీపక్ 'యాక్షన్' ఆర్డర్.. క్షేత్రస్థాయిలో ఎమ్మార్వో బక్కయ్య, ఎస్ఐ ఉదయ్ కిరణ్, ఈవో రాహుల్ అటాక్! ఆక్రమణదారుల గుండెల్లో 'జనం పవర్ జర్నలిస్ట్' వణుకు! అధికార గణం కూర్చునే మండల పరిపాలనా కేంద్రం ముక్కు ముందరే కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిపై కబ్జాకోరులు కన్నేశారు. జన్నారం తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న సర్వే నంబర్ 374 నిశబ్దంగా ఆక్రమణల చెరలోకి వెళ్తోంది. రాత్రికి రాత్రే పునాదులు లేచాయి, గోడలు వెలిశాయి. అంతా సజావుగానే సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో.. 'జనం పవర్' దినపత్రిక...