జన్నారం తిమ్మాపూర్ MPUPSలో కలకలం: విద్యార్థినుల పట్ల SGT సురేందర్ అసభ్య ప్రవర్తన.. నిలదీసిన హెడ్ మాస్టర్, రంగంలోకి NHRC ప్రతినిధి

జన్నారం మండలం తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల (MPUPS)లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం విద్యాశాఖతో పాటు స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ఎస్జీటీ (SGT) ఉపాధ్యాయుడు కామరూపంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ​మార్చి నుంచే మొదలైన వేధింపులు: గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరిట వికృత చేష్టలు ​పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న ఏ. సురేందర్ అనే ఉపాధ్యాయుడు గత మార్చి, ఏప్రిల్ నెలల నుంచే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. తరగతి గదిలో పాఠాలు బోధించాల్సింది పోయి, బాలికలను దగ్గరకు పిలిచి ‘గుడ్...