అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, పరిపాలనా నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గంజాయి, గుడుంబా, దేశీదారు తయారీ, రవాణా, విక్రయాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు సమాచారం అందించే పోలీసు సిబ్బందిని ప్రోత్సహించేందుకు నగదు రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే...