జన్నారం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ జి. శ్రీనివాస్‌కు ఆత్మీయ వీడ్కోలు
జన్నారం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఏఎస్ఐ జి. శ్రీనివాస్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని పీసీఆర్ విభాగానికి బదిలీ కావడంతో ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని శ్రీనివాస్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి. ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, జి. శ్రీనివాస్ జన్నారం పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన కాలంలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు....