తప్పుడు ప్రచారంతో పరువు నష్టం.. న్యాయం చేయాలని ప్రధానోపాధ్యాయుడి విజ్ఞప్తి
జన్నారం మండలం తిమ్మాపూర్ ఎంపీయూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, తన వివరణ తీసుకోకుండానే ఏకపక్షంగా వార్తలు ప్రచురించడం బాధాకరమని అన్నారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా, అధికారిక విచారణ జరగకపోయినా ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాలలో క్రమశిక్షణ కోసం నిబంధనల మేరకు తీసుకున్న పరిపాలనా చర్యలను వ్యక్తిగత కక్షగా మార్చి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత పరిచయాలు, ప్రభావంతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన సామాజిక నేపథ్యాన్ని...