భూమి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి: బాధితురాలు డి. స్వరూపరాణి
జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన డి. స్వరూపరాణి తన పేరుపై సర్వే నంబర్ 146/1-1లో మొత్తం 5 ఎకరాల పట్టా భూమి ఉందని తెలిపారు. ఈ భూమిలో ఉన్న కుంటలో 1987 సంవత్సరం నుంచి చేపల పెంపకం చేపడుతూ తమ కుటుంబం జీవనోపాధి సాగిస్తోందని పేర్కొన్నారు. అయితే ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా తమ భూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్ జారీ చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 7, 2026న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు మరోసారి ఫిర్యాదు చేసి, తమ భూమికి...