దుబాయ్‌లో జన్నారం యువకుడి మృతి: స్వగ్రామానికి చేరిన మృతదేహం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

కన్నవారిని, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను ఒక మంచి భవిష్యత్తు కోసం వదిలి, ఎడారి దేశానికి వెళ్లిన ఆ యువకుడు శవమై తిరిగివచ్చాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రెండ్లగూడ గ్రామానికి చెందిన మంత్రి మహేష్ ఇటీవల యూఏఈ (దుబాయ్) లో అనారోగ్యంతో కన్నుమూశాడు. మంగళవారం ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ​గల్ఫ్ అసోసియేషన్ చొరవతోనే స్వదేశానికి.. ​మహేష్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో, ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మగ్గిడి తిరుపతి ఆపద్బాంధవుడిగా నిలిచారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి: ​మహేష్ పనిచేస్తున్న...