'చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు'
చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సర్పంచ్ రాథోడ్ దిలీప్ అన్నారు. మంగళవారం నార్నూర్ మండలం తాడిహత్నూర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన చిన్నారి, గర్భిణీ, బాలింతలకు సక్రమంగా అందేలా కృషి చేయాలనీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో రాథోడ్ మోతిరాం, మెస్రం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.