దేవునిగూడెంలో ఘనంగా 'కప్పతల్లి' సంబరాలు: వర్షాల కోసం వరుణ దేవునికి ప్రత్యేక పూజలు
జన్నారం: మండలంలోని దేవునిగూడెం గ్రామం సాంప్రదాయ పూజలకు వేదికైంది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన నీటి కరవుతో అల్లాడుతున్న గ్రామస్తులు, వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ రోజు గ్రామంలో వినూత్నంగా 'కప్పతల్లి' ఆటను నిర్వహించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటం, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతుండటంతో.. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామ మహిళలు ఈ సంప్రదాయ వేడుకను భక్తిశ్రద్ధలతో జరిపారు. కప్పలకు పెళ్లి.. ఊరేగింపు తమ పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయం ప్రకారం, మహిళలంతా కలిసి కప్పలకు ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం ఆ కప్పలను ఒక గంపలో ఉంచి, పూలతో అలంకరించి గ్రామంలోని వీధివీధినా ఊరేగించారు. మహిళలు కప్పతల్లి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ...