ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా ఆకాడి పండుగ వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఎంపల్లి, మాన్కపూర్, మల్కుగూడ, అదేవిదంగా గాదిగూడ మండలం ఆదివాసీ గ్రామ శివారులో గురువారం ఆకాడి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అడవితల్లి, దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడే వండిన అన్నంతో లడ్డూ గోలాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పశువులను ప్రత్యేకంగా అలంకరించి దేవతల చుట్టూ ఊరేగించారు. పశువుల కాపరులకు ప్రసాదాన్ని అందించి వాటి ఆరోగ్యం, గ్రామంలో సుఖశాంతులు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు టేకు ఆకుల్లో సామూహిక భోజనాలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని...