విద్యాసంస్థల్లో డ్రగ్స్‌కు చెక్.. జీరో టాలరెన్స్ అమలుకు డీజీపీ సి.వి. ఆనంద్ ఆదేశాలు
రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలను పూర్తిగా డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పోలీసు శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగం, సరఫరాపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఈగల్ (EAGLE) విభాగం అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణపై హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో తప్పనిసరిగా "యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలు" ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యాసంస్థలో ఒక క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ నియమించి, విద్యార్థుల భద్రతతో...