సెంట్రింగ్ మాటున టేకు కలప అక్రమ రవాణా.. రూ.75 వేల విలువైన కలప స్వాధీనం

మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ పరిధిలోని ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లో సెంట్రింగ్ కలప మాటున అక్రమంగా టేకు కలప తరలిస్తున్న మినీ వ్యాన్‌ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. సోమవారం కలమడుగు అటవీ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, TS 19 T 3770 నంబర్ గల అశోక్ లేలాండ్ మినీ వ్యాన్‌లో ఎలాంటి చెల్లుబాటు అయ్యే ట్రాన్సిట్ పర్మిట్ లేకుండా టేకు దూలాలు, టేకు ఫర్నిచర్, టేకు దుంగలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాహనంతో పాటు సుమారు రూ.75 వేల విలువైన టేకు అటవీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని సంబంధిత అటవీ చట్టాల ప్రకారం అటవీ నేర కేసు నమోదు చేశారు....