*శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన*
*హంగిర్గకు రూ.కోటిన్నర అభివృద్ధి నిధులు* ఎమ్మెల్యే రామారావు పటేల్ నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని హంగిర్గ గ్రామ అభివృద్ధికి సుమారు రూ.కోటిన్నర నిధులు మంజూరైనట్లు *ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.* దేవాదాయ, ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధుల నుంచి రూ.50 లక్షలతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కళ్యాణ మండపం, రోడ్లు, డ్రైనేజీతో పాటు హిప్నెల్లి నుంచి సరస్వతి నగర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అంగన్‌వాడీ, వివో భవనాలు, గ్రామపంచాయతీ భవనం తదితర అభివృద్ధి పనులకు...