బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు
జనం పవర్ జర్నలిస్ట్ వేల్పుల నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఆగస్టు 25, గోదావరిఖని: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి 11వ ఇంక్లైన్ మైన్‌లో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు, సిబ్బందికి సంప్రదాయబద్ధంగా రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోమారపు లావణ్య అరుణ్ మాట్లాడుతూ.. రక్షాబంధన్ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సింగరేణి కార్మికులు సంస్థ అభివృద్ధికి అందిస్తున్న...