పిపిఎల్ మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా నిట్టూరి సారయ్య
జనం పవర్ జర్నలిస్టు వేల్పుల నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఆగస్టు 31, మంచిర్యాల: ప్రగతిశీల ప్రైవేట్ పాఠశాలల (పిపిఎల్) మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నికలు ఘనంగా జరిగాయి. మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్‌లో డాక్టర్ నీలకంఠేశ్వరరావు నివాసంలో రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి మెడపట్ల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నిట్టూరి సారయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు నిట్టూరి సారయ్య మాట్లాడుతూ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పిపిఎల్ తరఫున నిరంతరం కృషి చేస్తామని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన...