ఏకశిలా ధ్వజ స్తంభం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా..
జనం పవర్ జర్నలిస్టు వేల్పూర్ నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఆగస్టు 31, భక్తుల సౌకర్యార్థం ఆలయాల ముందు నూతన షెడ్ల ప్రారంభం రామకృష్ణాపూర్: పట్టణంలోని శ్రీశ్రీశ్రీ విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో ఏకశిలా ధ్వజ స్తంభం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు బూరుగుపల్లి రామకృష్ణ శర్మ, రాజేందర్ శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛారణలతో ధ్వజ స్తంభానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు, కృష్ణమూర్తి అయ్యప్ప గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి,...