అల్లం వారి కుంటను కాపాడాలి రైతుల వినతి.. స్పందించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
తహసీల్దార్‌కు తక్షణ చర్యల ఆదేశం జన్నారం, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అల్లం వారి కుంటను పరిరక్షించి, భవిష్యత్‌లో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను కోరారు. ఆదివారం ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. అల్లం వారి కుంటపై ఆధారపడి పలువురు రైతులు వ్యవసాయం సాగిస్తున్నారని, కుంటకు ఏ విధమైన నష్టం జరిగినా సాగునీటితో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కుంటను పూర్తిస్థాయిలో పరిరక్షించేందుకు...