పేద వ్యవసాయ కుటుంబం నుంచి డాక్టరేట్ వరకు.. తపాలాపూర్ యువకుడి ఘన ప్రస్థానం

జన్నారం: పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన మురిమడుగుల సత్తయ్య ఉన్నత విద్యలో అంచెలంచెలుగా ఎదిగి డాక్టరేట్ సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. తపాలాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం లక్ష్మీరాజ్యం, రాజవ్వ దంపతుల కుమారుడైన సత్తయ్య తన విద్యా ప్రస్థానంతో గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన అనంతరం సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుకున్నారు. ఉన్నత విద్యలో భాగంగా బెనారస్ హిందూ యూనివర్సిటీలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. అనంతరం దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్ పూర్తి చేశారు....