గుడిపేట వద్ద రక్తపుటేర్లు.. ముగ్గురు యువకులు మృతి
టిప్పర్ను ఓవర్టేక్ చేస్తూ ఘోర ప్రమాదం.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీసీపీ భాస్కర్ **జనం పవర్ జర్నలిస్టు, వేల్పుల నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, నవంబర్ 7:** మంచిర్యాల జిల్లా గుడిపేట గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడగా, టిప్పర్ చక్రాలు వారిపై నుంచి వెళ్లడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతులను మహ్మద్ సోహెల్ (23), ఖాన్ ఆఫ్రోజ్ ఖాన్, వేల్పుల సిద్ధార్థ్ (22)గా గుర్తించారు. వీరు...