Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తప్పుడు ప్రచారంతో పరువు నష్టం.. న్యాయం చేయాలని ప్రధానోపాధ్యాయుడి విజ్ఞప్తి

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 06 Jul 2026, 06:07 PM |
    తప్పుడు ప్రచారంతో పరువు నష్టం.. న్యాయం చేయాలని ప్రధానోపాధ్యాయుడి విజ్ఞప్తి

    జన్నారం మండలం తిమ్మాపూర్ ఎంపీయూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, తన వివరణ తీసుకోకుండానే ఏకపక్షంగా వార్తలు ప్రచురించడం బాధాకరమని అన్నారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా, అధికారిక విచారణ జరగకపోయినా ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
    పాఠశాలలో క్రమశిక్షణ కోసం నిబంధనల మేరకు తీసుకున్న పరిపాలనా చర్యలను వ్యక్తిగత కక్షగా మార్చి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత పరిచయాలు, ప్రభావంతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన సామాజిక నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకుని కూడా వివక్ష చూపుతున్నారని అన్నారు.
    ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని, అవసరమైతే జన్నారం మండలంలోని మరో పాఠశాలకు బదిలీ చేయాలని కోరారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు వాస్తవాలను తెలుసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
    వాస్తవాలను నిర్ధారించకుండా ప్రచురించే వార్తలు ఒక ఉపాధ్యాయుడి గౌరవాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ, బాధ్యతాయుతమైన జర్నలిజం పాటించాలని మీడియాను కోరారు.

    అత్యధికంగా చదివినవి