Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

    Author Maithreya | 16 Jul 2026, 08:33 PM | తెలంగాణ
    ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

    ఆదిలాబాద్ పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ మధు వివరాలను వెల్లడించారు. సోనాలకు చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటుకు నీటి పారుదల శాఖ ఈఈ రాథోడ్ విట్టల్, ఏఈ రమేష్ కలిసి ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీ కోసం ముందుగా రూ.లక్ష డిమాండ్ చేశారు. చివరికి వారు ఒప్పందం కుదిరించి గురువారం స్థానిక కార్యాలయంలో రూ.60వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారన్నారు. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరైనా లంచం తీసుకుంటే 1064 లేదా 91546 88963 నంబర్లను సంప్రదించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ మధు పేర్కొన్నారు.