Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కవ్వాల్‌లో వాన దేవుని కరుణ: సర్పంచ్, నాయకుల మొక్కులు ఫలించి పారిన సెలయేళ్లు!

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 21 Jul 2026, 11:10 AM |
    కవ్వాల్‌లో వాన దేవుని కరుణ: సర్పంచ్, నాయకుల మొక్కులు ఫలించి పారిన సెలయేళ్లు!

    వర్షాకాలం సగం గడిచినా చుక్క నీరు లేక, ఎండిపోతున్న పొలాలను చూసి ఏడవలేక ఏడుస్తున్న రైతన్నల గుండెల్లో వాన దేవుడు ఆశల వెలుగులు నింపాడు. జన్నారం మండలం కవ్వాల్ గ్రామపంచాయతీలో వారం రోజుల క్రితం సర్పంచ్ లాకవత్ సక్రు నాయక్, ఉప సర్పంచ్ నల్ల తీగల విష్ణు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి జరిపిన గ్రామోత్సవం, దేవతలకు చెల్లించిన మొక్కులు ఫలించాయి.
    ​వర ప్రసాదమైన మొక్కులు –

    మారిన పరిణామాలు:

    ​ఆందోళనలో గ్రామం: గత వారం రోజుల క్రితం వరకు కవ్వాల్‌ గ్రామంలోని చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక వెలవెలబోయాయి. పంటలు ఎలా వేయాలో తెలియక రైతులు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు.

    ​ఐక్యంగా ముక్కారు:

    ఇవి కూడా చదవండి

    ఈ తీవ్ర అనావృష్టి పరిస్థితుల నుంచి గ్రామాన్ని గట్టెక్కించేందుకు, గత ఆదివారం రోజున గ్రామ పెద్దలు, సర్పంచ్ లకవత్ సక్రు నాయక్, ఉప సర్పంచ్ నల్లతీగల విష్ణు, వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజలంతా ఏకమయ్యారు.
    ​సకల దేవతలకు నైవేద్యం: గ్రామంలో సకల దేవతలతో పాటు వానరుడికి (వర్ష దేవునికి) ప్రత్యేక పూజలు నిర్వహించి, దున్నపోతు మరియు కోళ్లను మొక్కుబడిగా సమర్పించేందుకు వీధుల్లో ఊరేగింపు చేపట్టారు.
    ​సర్పంచ్ హుషారు.. డప్పు దెబ్బకు నాట్యం!

    ​ఊరేగింపు సమయంలో సర్పంచ్ లకవత్ సక్రు నాయక్ గంభీరమైన హోదాను పక్కనపెట్టి, "ప్రజల కష్టమే నా కష్టం" అని భావించి డప్పు దెబ్బకు అనుగుణంగా ఉత్సాహంగా డాన్స్ చేశారు. చేతిలో రుమాలు ఊపుతూ ఆయన వేసిన అడుగులు గ్రామస్థుల్లో కొండంత ధైర్యాన్ని, సంతోషాన్ని నింపాయి.
    ​రెండు రోజులుగా దంచికొడుతున్న

    వానలు:

    ​మొక్కు తీర్చుకున్న రెండవ రోజు నుంచే కవ్వాల్ గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కరిమబ్బులు కమ్ముకుని వరుసగా రెండు, మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
    ​నిండుతున్న చెరువులు: నిన్నటి వరకు చుక్క నీరు లేని చెరువులు, కుంటలు ఇప్పుడు సగం వరకు నీటితో నిండిపోయాయి.
    ​రైతుల ఆనందహేల: ఎండిపోతుందనుకున్న నేలతల్లి జలకళను సంతరించుకోవడంతో రైతన్నలు సంతోషంతో పొలాల బాట పట్టారు.

    ​"మా కష్టాలను ఆలకించి వర్షాలు కురిపించిన ఆ వాన దేవునికి, గ్రామాన్ని ఏకతాటిపైకి తెచ్చి ధైర్యం చెప్పిన గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు."
    — కవ్వాల్ గ్రామ ప్రజలు & రైతులు