Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవాపూర్ లో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 15 Sep 2026, 10:16 PM |
    దేవాపూర్ లో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  యూనిఫామ్స్ పంపిణీ

    జనం పవర్ జర్నలిస్టు వేల్పుల నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సెప్టెంబర్ 15,


    మంచిర్యాల జిల్లా దేవాపూర్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సిడం రాందాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రొడ్డ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, యూనిఫామ్స్ కుట్టి అందించిన మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహిళా సంఘం సభ్యులను పాఠశాల సిబ్బంది అభినందించారు.