Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కడెం నీళ్లు బంద్.. పంట పొట్ట దశలో రైతుల గుండెల్లో గుబులు!

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 05 Nov 2026, 01:33 PM |
    కడెం నీళ్లు బంద్.. పంట పొట్ట దశలో రైతుల గుండెల్లో గుబులు!

    తిమ్మాపూర్–రాంపూర్ రైతుల రాస్తారోకో.. సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

    అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.. చివరి పంట వరకు నీరందించాలని డిమాండ్

    కడెం నీళ్లు బంద్.. పంట పొట్ట దశలో రైతుల గుండెల్లో గుబులు! - Additional Image

    పంట చేతికొచ్చే కీలక సమయంలో సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కడెం ఆయకట్టు నీటిని సరైన సమయంలో నిలిపివేయడంతో పంటలు పొట్ట దశకు చేరుకున్న తరుణంలో నీరు లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాల రైతులు తమ సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జన్నారం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి తమ గోడును అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

    ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జాడి గంగాధర్ మాట్లాడుతూ.. రైతుల పంటలు కీలక దశకు చేరుకున్న సమయంలో కడెం ఆయకట్టు నీటి సరఫరాను నిలిపివేయడం అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, మరోవైపు పంటలకు అత్యవసరంగా నీరు అవసరమైన సమయంలో సాగునీటిని నిలిపివేసి రైతులను సంక్షోభంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

    ఇవి కూడా చదవండి

    ప్రకటనల్లో రైతు సంక్షేమం.. క్షేత్రస్థాయిలో సాగునీటి కష్టాలు!

    రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న పాలకులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని గంగాధర్ డిమాండ్ చేశారు. పంట పొట్ట దశలో నీరు అందకపోతే రైతులు పెట్టిన పెట్టుబడులు వృథా అయ్యే ప్రమాదం ఉందని, ఇప్పటికే వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలకు సాగునీటి కొరత మరింత భారంగా మారిందని పేర్కొన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా నీటి సరఫరా నిలిపివేయడం రైతులను నిండా ముంచడమేనని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కడెం ఆయకట్టు నీటిని పునరుద్ధరించాలని, చివరి పంట వరకు నిరంతరాయంగా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని, తీవ్ర నష్టాలతో రైతులు ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రాణాలతో, పంటలతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో రైతులు జునుకూరి మల్లయ్య, జాడి రాజన్న, పోషన్న, లక్ష్మణ్, శంకరయ్య, బాలరాజు, రాంపూర్ ఉపసర్పంచ్ వెంకటేష్, జాడి లచ్చన్న, శంకర్, లక్ష్మణ్, గుండా లచ్చన్న, గుండా నరసయ్య, వెంకటేష్, గోపాల్, తిమ్మాపూర్ ఉపసర్పంచ్ నగేష్, బానయ్యతో పాటు తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.
    పంట చేతికొచ్చే కీలక సమయంలో సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కడెం ఆయకట్టు నీటిని సరైన సమయంలో నిలిపివేయడంతో పంటలు పొట్ట దశకు చేరుకున్న తరుణంలో నీరు లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాల రైతులు తమ సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జన్నారం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి తమ గోడును అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
    ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జాడి గంగాధర్ మాట్లాడుతూ.. రైతుల పంటలు కీలక దశకు చేరుకున్న సమయంలో కడెం ఆయకట్టు నీటి సరఫరాను నిలిపివేయడం అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, మరోవైపు పంటలకు అత్యవసరంగా నీరు అవసరమైన సమయంలో సాగునీటిని నిలిపివేసి రైతులను సంక్షోభంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

    **ప్రకటనల్లో రైతు సంక్షేమం.. క్షేత్రస్థాయిలో సాగునీటి కష్టాలు!**

    రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న పాలకులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని గంగాధర్ డిమాండ్ చేశారు. పంట పొట్ట దశలో నీరు అందకపోతే రైతులు పెట్టిన పెట్టుబడులు వృథా అయ్యే ప్రమాదం ఉందని, ఇప్పటికే వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలకు సాగునీటి కొరత మరింత భారంగా మారిందని పేర్కొన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా నీటి సరఫరా నిలిపివేయడం రైతులను నిండా ముంచడమేనని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
    ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కడెం ఆయకట్టు నీటిని పునరుద్ధరించాలని, చివరి పంట వరకు నిరంతరాయంగా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని, తీవ్ర నష్టాలతో రైతులు ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రాణాలతో, పంటలతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
    ఈ రాస్తారోకోలో రైతులు జునుకూరి మల్లయ్య, జాడి రాజన్న, పోషన్న, లక్ష్మణ్, శంకరయ్య, బాలరాజు, రాంపూర్ ఉపసర్పంచ్ వెంకటేష్, జాడి లచ్చన్న, శంకర్, లక్ష్మణ్, గుండా లచ్చన్న, గుండా నరసయ్య, వెంకటేష్, జితేందర్, గోపాల్, తిమ్మాపూర్ ఉపసర్పంచ్ నగేష్, బానయ్యతో పాటు తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.