Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జన్నారం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 08 Nov 2026, 03:40 PM |
    జన్నారం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

    దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు సుష్మ–భూమేష్ గ్రామ ప్రజలకు, జన్నారం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
    ఈ దీపాల పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకున్నారు. ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందాలని, గ్రామాల్లో ఐక్యత, అభివృద్ధి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
    పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సర్పంచ్ జక్కు సుష్మ–భూమేష్ పిలుపునిచ్చారు. దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆశయాలకు నాంది పలకాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వారు ఆకాంక్షించారు.