Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుడిపేట వద్ద రక్తపుటేర్లు.. ముగ్గురు యువకులు మృతి

    Author ఎడిటర్ తుడుం జితేందర్ | 08 Nov 2026, 09:59 AM |
    గుడిపేట వద్ద రక్తపుటేర్లు.. ముగ్గురు యువకులు మృతి

    టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేస్తూ ఘోర ప్రమాదం.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీసీపీ భాస్కర్

    **జనం పవర్ జర్నలిస్టు, వేల్పుల నగేష్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, నవంబర్ 7:**


    మంచిర్యాల జిల్లా గుడిపేట గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడగా, టిప్పర్ చక్రాలు వారిపై నుంచి వెళ్లడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
    మృతులను మహ్మద్ సోహెల్ (23), ఖాన్ ఆఫ్రోజ్ ఖాన్, వేల్పుల సిద్ధార్థ్ (22)గా గుర్తించారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట వైపు ద్విచక్ర వాహనంపై ముగ్గురు బయలుదేరారు. గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలో జైపూర్ వైపు నుంచి వస్తున్న టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
    ప్రమాద సమాచారం అందుకున్న మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
    మృతుల్లో సోహెల్ అన్న మహ్మద్ బబ్లూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రహదారిపై జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.

    గుడిపేట వద్ద రక్తపుటేర్లు.. ముగ్గురు యువకులు మృతి - Additional Image